నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 17:00

చేనేత పరిశ్రమ మరియు కార్మికుల అంశాలను వివిధ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలి

చేనేత పరిశ్రమ మరియు కార్మికుల అంశాలను వివిధ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలి

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్

   తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ పార్టీలు చేనేత పరిశ్రమ రక్షణ మరియు కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం వివిధ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చేర్చాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు

     

గురువారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ప్రతి చేనేత మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి 10 లక్షల రూపాయల పెట్టుబడి సహాయం చేనేత బంధు ప్రకటించాలని కోరారు. , చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిపి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని,చేనేత సహకార సంఘాల మరియు కార్మికుల రుణాలను మాఫీ చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేది చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వమే ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్ర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కావలసిన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించాలని, చేనేతపైన ఉన్న జీఎస్టీ ని రద్దు చేయాలి, చేనేత సహకార సంఘాలకు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టవద్దు అని వారు అన్నారు . చేనేత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా జీవిత బీమా ఇల్లు మరియు వర్క్ షెడ్డు నిర్మాణం కొరకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చేనేత కార్మికులకు 2వందల యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ అంశాలన్నింటినీ వివిధ రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు

    

ఈ సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, సంఘం సినియర్ నాయకులు కర్నాటి లింగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఆలుగొండ మధు, జిల్లా నాయకులు ఏల శ్రీనివాస్, గడ్డం దశరథ ,జిల్లా దేవదానం , రాపోలు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 09:55

టీఎస్ఆర్టీసీ లక్కీ లాటరీ టికెట్: బస్సు ఎక్కితే లక్షల బహుమతి..

టీఎస్ఆర్టీసీ లక్కీ లాటరీ టికెట్: బస్సు ఎక్కితే లక్షల బహుమతి


హైదరాబాద్: వినియోగదారుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఆకట్టుకునేందుకు అనేక సరికొత్త పథకాలను తీసుకొస్తొంది. తాజాగా, బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30 వరకు ఇది కొనసాగుతుంది.


టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలి. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.


ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులను టీఎస్ఆర్టీసీ సంస్థ అందించనుంది.

ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరింది.

జూబ్లీ బస్టాండ్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులు



దసరా పండగ సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఏపీ వాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది.ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (JBS) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది. ఆ సర్వీసులు కేపీహెచ్ బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయి.


అక్టోబర్ 18 నుంచే ఈ 24 సర్వీసులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. జేబీఎస్ మీదుగా వెళ్లే ఈ బస్సుల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎంజీబీఎస్ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే ఛార్జీలుంటాయి. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ను సంప్రదించవచ్చు.

ప్రస్తుతం బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో జేబీఎస్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావాల్సి వచ్చేది. ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.



జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తుల మేరకు మొదటగా 24 సర్వీసులను జేబీఎస్ మీదుగా విజయవాడకు నడపాలని సంస్థ నిర్ణయించింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక , హబ్సిగుడ, ఉప్పల్ ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమైన ఈ బస్సులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోంది.

నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 09:44

బ్యాగుల వ్యాపారుల ముసుగులో ‘బంగారు’ వల...


బ్యాగుల వ్యాపారుల ముసుగులో ‘బంగారు’ వలనకిలీ బంగారు చైన్లను చూపుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌


బ్యాగుల వ్యాపారుల ముసుగులో ‘బంగారు’ వల



అంతర్రాష్ట ముఠాలోని ఇద్దరి అరెస్టు, ఒకరు పరారీ..




రూ.7.20లక్షల విలువైన 9 తులాల బంగారం స్వాధీనం

సూర్యాపేట క్రైం, అక్టోబరు 11: బ్యాగుల వ్యాపారుల ముసుగులో ప్రజలకు నకిలీ బంగారం అంటగట్టి మోసం చేస్తున్న అంతర్రాష్ట ముఠాలోని ఇద్దరిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.20లక్షల విలువైన 9 తులాల బంగారు ఆభరణాలు, నకిలీ బంగారు చైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ వివరించారు.

ముగ్గురు ముఠాగా ఏర్పడి పరిచయం పెంచుకుని..

మహారాష్ట్రలోని పర్బని జిల్లా పూర్ణ గ్రామానికి చెందిన ధరంచంద్‌ కన్నయ్యలాల్‌సోలంకి, విష్ణు, గుజరాత రాష్ట్రం అహ్మదాబాద్‌ పట్టణానికి చెందిన నారాయణ బ్యాగుల వ్యాపారులు. నారాయణ ప్రస్తుతం మేడ్చల్‌ -మల్కాజిరిగి జిల్లా సరస్వతినగర్‌లో స్థిరపడ్డాడు. ఈ ముగ్గురూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ బ్యాగుల వ్యాపారం చేస్తుంటారు. ఆగస్టులో బ్యాగులు విక్రయించడానికి ఖమ్మం సమీపంలోని ఏదులాపురానికి వెళ్లారు. ఆ సమయంలో ఖమ్మంలోని కాల్వ ఒడ్డు సమీపంలోని చికెన సెంటరు నిర్వాహకురాలిని పరిచయం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన తాము రోడ్ల నిర్మాణ పనులు చేస్తామని, రోడ్ల తవ్వకాల్లో రెండు కిలోల పురాతన నాణేలు, బంగారు చైన్లు లభించాయని తెలిపారు. వాటిని స్వరాషా్ట్రనికి తీసుకువెళ్లాలంటే మార్గ మధ్యలో పోలీసుల తనిఖీలు ఉంటాయని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తామని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నమ్మబలికారు. అప్పటికే తమ వద్ద ఉన్న ఒక బంగారు గుండును ఆ మహిళకు ఇచ్చి తనిఖీ చేయించుకోమని చెప్పారు. దానిని ఆమె తనిఖీ చేయించగా నిజమైన బంగారంగా తేలింది. దీంతో నిందితుల వద్ద ఉన్న మొత్తం బంగారం కొనుగోలు చేయడానికి ఆ మహిళ అంగీకరించింది. మొత్తం బంగారానికి రూ.10లక్షలు ఇవ్వాలని నిందితులు కోరగా, అంత డబ్బు తన వద్ద లేదని తన వద్ద ఉన్న బంగారు అభరణాలు తీసుకుని, బంగారు చైన్లు ఇవ్వాలని సదరు మహిళ కోరింది. అంగీకరించిన నిందితులు సూర్యాపేట ఆగస్టు 22వ తేదీన వచ్చి బంగారు ఆభరణాలు తీసుకెళ్లాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన సదరు మహిళ సూర్యాపేటకు వచ్చి 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదును నిందితులకు ఇచ్చి, వారి నుంచి బంగారు చైన్లగా భావించి తీసుకుని వెళ్లింది. ఇంటికి వెళ్లి తర్వాత వాటిని తనిఖీ చేయించి అవి నకిలీ బంగారు చైన్లు అని ఆమె తెలుసుకుంది. సూర్యాపేటకు ఆగస్టు 23న ఆమె వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

స్వస్థలాలకు వెళుతుండగా ఇలా పట్టుబడ్డారు

బ్యాగుల వ్యాపారం చేస్తున్న నిందితులు బుధవారం స్వస్థలాలకు వెళ్లేందుకు ధరంచంద్‌ కన్నయ్యలాల్‌సోలంకి, నారాయణ సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్‌ బుధవారం ఉదయం సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్‌ రోడ్డు ప్రాంతంలో పెట్రోలింగ్‌ చేస్తుండగా ఆ ఇద్దరూ అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. పోలీస్‌ వాహనాన్ని చూసి పరారయ్యేందుకు యత్నించగా, పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు.

నిందితుల బ్యాగులను తనిఖీ చేసి కొన్ని పురాతన వెండి నాణేలు, నకిలీ బంగారు చైన్లను స్వాధీనం చేసుకోవడంతో, సదరు మహిళకు చెందిన 9తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ మహిళ నుంచి తీసుకున్న రూ.లక్ష నగదును నిందితులు అప్పటికే ఖర్చు చేశారు. నిందితుల్లో విష్ణు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్ననట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, ఏపీ రాష్ట్రం అనంతపురంలో ఇలాంటి కేసులే ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు, డీఎస్పీ పరిక నాగభూషణం, సూర్యాపేట పట్టణ ఇనస్పెక్టర్‌ జి.రాజశేఖర్‌, ఎస్‌ఐ యాకుబ్‌, సిబ్బంది గొర్ల కృష్ణయ్య, గోదేశి కర్ణాకర్‌, జె.సైదులు, ఆనంద్‌, చీకూరి మధు, మీరా తదితరులు పాల్గొన్నారు.


నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 09:30

పండుగొచ్చింది.. పైసల్ లేవు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన..

Telangana: పండుగొచ్చింది.. పైసల్ లేవు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన..


కొద్ది నెలలుగా జీతాలు లేక తెలంగాణలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగల పూట చేతిలో చిల్లి గవ్వలేక అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు. తమకు ఇప్పటికే రెండు, మూడు నెలల నుంచి జీతం రావడం లేదని.. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పట్లో తమకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. బతుకమ్మ పండుగకు పిల్లలకు డ్రెస్సులు కొనిచ్చే పరిస్థితి కూడా లేదని వారు బాధపడుతున్నారు.


తమకు ఏదో విధంగా జీతాలు అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ శాఖల్లో పని చేస్తున్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమకు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. వీఆర్ఏలు గత ఏడాది 81 రోజుల పాటు సమ్మె చేశారు. దీంతో ప్రభుత్వం ఆగస్టు10న వీఆర్ఏలకు పేస్కేల్ ప్రకటించింది. వారిని పలు శాఖల్లో సర్దుబాటు చేసింది. దాదాపు 23 వేల మంది వీఆర్‍ఏలకు గాను14 వేల మందికి మాత్రమే అపాయింట్​మెంట్​ లెటర్లు ఇచ్చింది.

డిగ్రీ చదివిన వారిని జూనియర్​ అసిస్టెంట్లుగా, ఇంటర్​ చదిన వారిని రికార్డ్​అసిస్టెంట్, టెన్త్​, అంతకు తక్కువ చదివిన వారిని అటెండర్లుగా నియమించింది. అయితే నియామకాల తీరును తప్పుపడ్తూ అసలు శాఖల్లోని పలువురు ఆఫీస్​ సబ్​ఆర్డినేట్లు కోర్టుకెక్కారు. దీంతో వీఆర్​ఏలు ప్రభుత్వోద్యోగులుగా గుర్తింపు పొందినప్పటికీ కనీసం ఐడీ కార్డులు కూడా రాలేదు. రెగ్యులరైజ్​ చేసే క్రమంలో కొన్ని రూల్స్, గైడ్‍లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉండగా ఆ ప్రాసెస్‍ లేట్ చేశారు. దీంతో వీరి జీతాలు ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 583 మంది కళాకారులు పనిచేస్తున్న సంగతి తేలిసిందే. అయితే వీరికి సకాలంలో జీతాలు రావడం లేదని చెబుతున్నారు. వీరికి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. అక్టోబర్‍ నెల సగానికి వచ్చినా నేటికీ ఆగస్ట్​, సెప్టెంబర్‍ జీతాలు రాలేదని వారు వాపోతున్నారు. ఇటు మిషన్ భగీరథలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు రావడం లేదని తెలుస్తోంది. అటు ధరణి ఆపరేటర్లకు 7 నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 09:21

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. టీమిండియా స్టార్‌ ఆటగాడిపై వేటు! అశ్విన్‌ రీఎంట్రీ

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. టీమిండియా స్టార్‌ ఆటగాడిపై వేటు! అశ్విన్‌ రీఎంట్రీ




వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్‌ 19న పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే పుణేకు చేరుకున్న భారత జట్టు.. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.


పుణేలోని వికెట్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్నందన అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని భారత జట్టు మేనెజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్థూల్‌ ఠాకూర్‌ స్ధానంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌…


నిజందాగదుక్షణంఆగదు

Oct 16 2023, 17:28

పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కంచర్ల భూపాల్ రెడ్డి

 పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నల్లగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి  .... నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ & జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ...

 తనకచ్చొచ్చిన.. పానగల్లు నుండి అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం లో... కోలాహలంగా ...ఎన్నికల ప్రచారం ప్రారంభించిన..కంచర్ల

నుదుట విజయ తిలకం దిద్ది... ఘనస్వాగతం పలికిన స్థానిక కౌన్సిలర్, ఆలకుంట రాజేశ్వరి మోహన్ బాబు... ముఖ్య నాయకులు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు...

 ఇంటింటికి, మంగళహారతులతో.. విజయ తిలకం దిద్దిన మహిళలు..

 పానగల్లు ఇంటింటికి కంచర్ల వెంట నడిచిన వందలాది మంది మహిళలు...

 డప్పుల మోతలతో కోలాటాల విన్యాసాలతో.... వందలాది మంది కార్యకర్తలతో హోరెత్తిన పానగల్లు.

 శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజల అనంతరం

 జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్... నల్లగొండ బిఆరెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి గారిని రెండవసారి ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి కావాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు.. నల్లగొండకు తేవాలన్నా కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని... కారు గుర్తుపై ఓటు వేసి భూపాల్ రెడ్డి గారిని గెలిపించాలని నల్లగొండ అభివృద్ధిని కొనసాగించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

కంచర్ల మాట్లాడుతూ... నల్లగొండ పట్టణ అభివృద్ధి1350 కోట్లతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని మరో రెండు సంవత్సరాలలో ఆ పనులన్నీ పూర్తి అవుతాయని... విద్యా భారతి నుండి అద్దంకి రోడ్డు వరకు... ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డును రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించుకున్నామని, ఉదయ సముద్రం పక్కనే ఉన్న పానగల్లు గతంలో తాగునీరు వచ్చేవి కావని.. ఆ ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీరు అందిస్తున్నామని.. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న హైవే నిర్మాణం పూర్తి చేసుకున్నామని.,. ఎన్నో ప్రమాదాల కారణమైన పానగల్ బైపాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశామని ... గతంలో ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ కడతామని హామీ ఇచ్చామని... ఒక సంవత్సరం ఎన్నికలు రెండు సంవత్సరాల కరోనాతో.. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో కొంత ఆలస్యమైందని .

ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు. కెసిఆర్ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం...

 ఆసరా పెన్షన్లు ముందు 3016- ఆ తర్వాత ప్రతి సంవత్సరం 500 పెంచుతూ 5,016/- రూపాయలు.. దివ్యాంగుల పెన్షన్ 6,016 /-

 రైతుబంధు 12 వేల నుంచి 16 వేల వరకు.. విడతల వారిగా పెంచుతామని, బిపిఎల్ కుటుంబాలకు అందరికీ 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని.. గ్యాస్ సిలిండర్ ను 400 రూపాయలకే అందిస్తామని.. అర్హులైన మహిళలకు 3000 రూపాయల నెలవారి భృతి ఇస్తామనితెలిపారు.. గతంలో ఇచ్చిన హామీలు కేసీఆర్ నిలుపుకున్నారని, ఇప్పుడు ప్రకటించినవి కూడా కచ్చితంగా అమలు చేస్తారన్నారు..

 గత 20 సంవత్సరాలుగా మాయమాటలతో నల్లగొండను అభివృద్ధికి దూరం చేసిన నాయకులు, మళ్ళీ మీ ముందుకు వస్తారని వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని కారు గుర్తుపై మీ ఓటు వేసి మరొక్కసారి తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపి నల్లగొండ అభివృద్ధికి దోహదపడాలని ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నేడు పానగల్లు ఒకటి రెండు వార్డులలో.. సాయంత్రం 6 గంటల నుండి మూడో వార్డులో ప్రచారం నిర్వహిస్తామని తెలియజేశారు 

 భారీ ఎత్తున, పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు, ప్రజలు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు,

నిజందాగదుక్షణంఆగదు

Oct 16 2023, 17:19

10 కోట్లు , 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిఅమ్ముకున్నాడు: టి పి సి సి సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్

హైదరాబాద్ : 10 కోట్లు , 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు దిగిన టీపీసీసీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్

నాడు ఓటుకు నోటు , నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు 

65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణ

తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు

ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా... పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారు

రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది

వెంటనే రేవంత్ రెడ్డి ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ కు డిమాండ్

రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ , ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాము

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్ట్ ను ప్రక్షాళన చేయాలి

రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు

పోలీసులు తనకు రక్షణ కల్పించాలి

నిజందాగదుక్షణంఆగదు

Oct 16 2023, 17:13

ప్రజలంతా కేసీఆర్ వైపే

ప్రజలంతా కేసీఆర్ వైపే

చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్న నేత కేసిఆర్

రేషన్ ద్వార సన్నబియ్యం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కెసిఆర్ మానవీయ పాలనకు నిదర్శనం

తుంగతుర్తి లో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిషోర్ దే

పారిశ్రామిక హభ్ ను నెలకొల్పి , స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే కిషోర్ ఆశయం

కిషోర్ నుఆశీర్వదించండి .అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి

➖➖➖➖➖➖➖➖➖➖

తుంగతుర్తిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మంత్రి జగదీశ్ రెడ్డి

అర్వపల్లి యోగానంద స్వామి ఆలయంలో మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్యే కిషోర్ ప్రత్యేక పూజలు.....

శంఖం ఊది ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగదీష్ రెడ్డి

➖➖➖➖➖➖➖➖➖➖

చెప్పిన ప్రతి మాటను , చేసిన ప్రతీ వాగ్దానాన్ని నిజం చేసిన నేత ముఖ్యమంత్రి కేసిఆర్ అని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ తరపున ఎన్నికల శంఖారావాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి పూరించారు. అంతకుముందు అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నరసింహుని సన్నిధిలో కిషోర్ కుమార్ కు బి ఫారం ను అందజేశారు. అక్కడనే శంఖాన్ని ఊది ప్రచార పర్వానికి తెరలేపారు. అర్వపల్లి లో తరలి వచ్చిన ఆశేశ జనవాహిని ని ఉద్దేశించి  మంత్రి మాట్లాడుతూ రేషన్ ద్వార అందరికీ సన్నబియ్యం , సబ్సిడీ ద్వారా 400 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే నిర్ణయాలు కెసిఆర్ మానవీయ పాలనకు నిదర్శనం అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ వైపే తెలంగాణ ప్రజలు ఉన్నారని అన్నారు. 2014 ముందు కక్క్ష్యలు, కార్పన్యాలతో రక్తమోడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిషోర్ దే అన్నారు. కిషోర్ హయాంలో తుంగతుర్తి నియోజకవర్గం ససశ్యామలం అయిందన్నారు. 

పారిశ్రామిక హభ్ ను నెలకొల్పి , స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే కిషోర్ ఆశయం అన్నారు.

కిషోర్ ను మరోసారి ఆశీర్వదించి తుంగతుర్తి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 16 2023, 10:36

స్పష్టమైన ఆవగాహనతో ఓటేస్తేనే ప్రజలు గెలుస్తారు: సీఎం కేసీఆర్‌

స్పష్టమైన ఆవగాహనతో ఓటేస్తేనే ప్రజలు గెలుస్తారు: సీఎం కేసీఆర్‌

'తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి' అని ప్రజలను సీఎం కేసీఆర్‌ కోరారు.

స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్‌ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తారని, ప్రజల కోరికలు నెరవేరుతాయని చెప్పారు.

అభివృద్ధిని చూసి నన్ను దీవించండి

హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

ప్రజలందరి సహకారంతోనే నంబర్‌వన్‌గా తెలంగాణ

కాంగ్రెస్‌కు 10 చాన్స్‌లు ఇస్తే ప్రజలకు చేసిందేంది?

60 ఏండ్ల కిందే దళితబంధు ఉంటే పేదరికం ఉండేదా?

విధివంచితులను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానిదే

నేడు రైతులకు కంటినిండా నిద్ర.. కడుపునిండా కరెంటు

వడ్ల రాశులు చూస్తే లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టున్నది

మిషన్‌ భగీరథలాంటి పథకం ప్రపంచంలోనే లేదు

సీఎం హోదాలో మళ్లీ హుస్నాబాద్‌కు వస్తా: కేసీఆర్‌

అభ్యర్థి వొడితెల సతీశ్‌కు బీఆర్‌ఎస్‌ బీ-ఫాం అందజేత

తొమ్మిదిన్నరేండ్ల కిందట తెలంగాణ పరిస్థితి ఎంత భయానకమో గుర్తు చేసుకోవాలి. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నట్టే.. ప్రజలందరి సహకారంతో తెలంగాణను ఈ రోజు అనేక రంగాల్లో నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకుపోయినం. కేంద్రం సహకరించకున్నా, గౌరవెల్లిలాంటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా అన్నింటినీ అధిగమించుకొంటూ ఒక్కొక్కటీ పూర్తిచేసుకొంటూ వచ్చాం. అద్భుతమైన విజయాలు సాధించాం. ఆ క్రమం కొనసాగాలి.

-సీంఎ కేసీఆర్‌

 'తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి' అని ప్రజలను సీఎం కేసీఆర్‌ కోరారు. స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్‌ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తారని, ప్రజల కోరికలు నెరవేరుతాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా హు స్నాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్‌కు బీఫారం అందజేశారు. 'సభ సాక్షి గా, మీ అందరి సాక్షిగా సతీశ్‌కు బీఫారం అందిస్తున్నాను. మీ బిడ్డగా దీవించండి' అని ప్రజల ను కోరారు. అనంతరం ప్రసంగిస్తూ.. 2018 లో అసెంబ్లీ ఎన్నికల మొదటి సభను హుస్నాబాద్‌లోనే నిర్వహించినట్టు గుర్తు చేశారు. 'హుస్నాబాద్‌ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు నాలుగిం ట మూడు వంతులు.. అంటే 88 సీట్లతో అఖం డ విజయాన్ని సాధించినం. ఈసారి కూడా మళ్లీ హుస్నాబాద్‌ నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు సూచించారు. అందుకే ఈ రోజు హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి, మ్యానిఫెస్టో ప్రకటించి, మీ దర్శనానికి ఇక్కడికి వచ్చాను' అని చెప్పారు.

రౌతేందో.. రత్నమేందో గుర్తించాలె

తాను చెప్పే విషయాలను విని వదిలేయకుండా ఇంట్లో, బస్తీలో, గ్రామంలో, తండాల్లో చర్చించాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు. 'ఎన్నికలు చాలా వస్తయి, చాలా పోతయి, ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. రౌతేందో.. రత్నమేందో ఆలోచించాలె. మనకు పనికొచ్చేదేందో గుర్తు వ ట్టాలె' అని అన్నారు. ఎవరో చెప్పారని ఓట్లు వేయొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని చెప్పారు. మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్ర తలరాతను మార్చే శక్తి ఓటుకు ఉన్నదని అన్నారు.

10 చాన్స్‌లిస్తే ఏం చేశారు?

'ఎన్నికలు రాంగనే కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతరు. అలవిగాని హామీలు ఇస్తరు. ఆపద మొక్కులు మొక్కుతరు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నేను గుళ్లె, నేను సల్లె అన్నట్టుగా.. యాడికి తీసుకపోతరో తెల్వదు' అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలు వచ్చి ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నాయ ని మండిపడ్డారు. 'ఒక్క చాన్స్‌ ఎందుకు నాయ నా ప్రజలు మీకు 10 చాన్సులు ఇచ్చారు కదా.. 60 ఏండ్లు మీరే రాజ్యం ఎలుగవెట్టిర్రు కదా. చేసిందేమిటి?' అని ప్రశ్నించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో దళితులు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారంటే అందరం బాధపడాలని, దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఒకవేళ 60-70 ఏండ్ల కిందటే దళితబంధులాంటి పథకం పెట్టి ఉంటే, ఇప్పుడు దళితుల్లో ఎందుకు పేదరికం ఉండేదో ఆలోచించాలని తెలిపారు. ఈ విధాన లోపం ఎవరిదని ప్రశ్నించారు. 50 ఏండ్లు రాజ్యం చేసి, ఇప్పు డు మల్లా ఓట్లడిగేటోళ్లు పాలించిన జమానాలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండేదో గుర్తు చేసుకోవాలని అన్నారు.

 

తెలంగాణలో ఇప్పుడు రైతుకు తెల్లందాక కరెంటు పెట్టబోయే బాధ లేదు. ఇప్పుడు కంటి నిండా నిద్ర.. కడుపు నిండా కరెంటు .. కల్లాల నిండా వడ్లు. రెండు నెలలు వందల లారీలు పెట్టి గుంజినా తరగని వడ్లు. కల్లాలు ఒడుస్తలేవు. ఏ గ్రామంలో చూసినా, ఏ తారు రోడ్డులో చూసినా ధాన్యపు రాశులతో నిండిపోయాయి. వాటిని చూస్తే లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నది. ఇవన్నీ ఊరికే రాలేదు.. వాటి వెనుక ఎంతో కృషి ఉన్నది.

-సీఎం కేసీఆర్‌

వారిని ఆదుకొనే బాధ్యత సమాజానిదే

గతంలో పింఛన్‌ రూ.40, రూ.70 చివరగా రూ.200 ఇచ్చారని కేసీఆర్‌ గుర్తు చేశారు. తాను సీఎం అయిన తర్వాత 'ఎందుకు పెన్షన్‌ ఇవ్వాలి?. దానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉన్నదా? ఓట్ల కోసం మాత్రమే ఇస్తున్నామా?' అని అధికారులను అడిగానని చెప్పారు. అప్పు డు తేలిందేమిటంటే.. దురదృష్టవశాత్తూ మాన వ సమాజంలో కొందరు విధివంచితులు ఉం టారని, వారిని డెస్టిట్యూట్స్‌ అంటారని అన్నా రు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పిల్లలు సరిగా చూడని వృద్ధులు ఉం టారని, ఏ రోజుకైనా వాళ్లందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానిదేనని స్పష్టం చేశారు. అందుకే పింఛన్‌ పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. మానవీయ కోణంలో ఒకేసారి పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచామని చెప్పారు. తొలివిడత పూర్తయ్యేసరికి రూ.2 వేలకు తీసుకుపోయామని గుర్తుచేశారు. ఇప్పుడు రూ.5 వేలకు పెంచబోతున్నట్టు చెప్పారు. ఓట్ల కోసం ఒకే రోజులో రూ.5 వేలకు పెంచుతామని చెప్పలేదని, మొదట రూ.3 వేలకు పెంచి తర్వాత ఏటా రూ.500 పెంచుతూ ఐదేండ్లు ముగిసేనాటికి రూ.ఐదు వేల పెన్షన్‌ ఇస్తామని తెలిపారు. రైతుబంధు పెట్టాలని తనను ఎవరూ అడగలేదని, ఎవరూ డిమాండ్‌ చేయలేదని చెప్పారు. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నామని, దాన్ని ఇంకా పెంచుతున్నామని చెప్పారు.

హుస్నాబాద్‌ అద్భుతంగా మారింది

ఒకప్పుడు హుస్నాబాద్‌కు హెలికాప్టర్‌లో వస్తుంటే కండ్లల్లో నీళ్లు వచ్చేవని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండల్లో నీళ్లు తీసుకుపోయి తోట లో మొక్కలు కాపాడుకున్న ఘటనలను చూశానని చెప్పారు. ఇప్పుడు హెలికాప్టర్‌ నుంచి చూస్తే హుస్నాబాద్‌ వాగుమీద రెండుమూడు చెక్‌డ్యాంలు వరుసగా కనిపిస్తున్నాయని, రెం డిట్లో నీళ్లు ఉన్నాయని తెలిపారు. కనుచూపుమేర పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయని చెప్పారు. హుస్నాబాద్‌కు అటు దేవాదుల, ఇటు తోటపల్లి బరాజ్‌ నుంచి నీళ్లు వస్తున్నాయని, 1.10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే గౌరవెల్లి ప్రాజెక్టును దాదాపు పూర్తి చేసుకున్నామని చెప్పారు. ఎలక్షన్‌ తర్వాత 6 నెలలు కష్టపడితే లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. 'ఇక్కడ ఓట్ల కోసం ఒక్క చాన్స్‌ ఇవ్వమని అడిగేందుకు వస్తున్నారు.. మోసకపోకండి. ఆ పెద్దలు ఇక్కడ చాలా వెలగబెట్టారు. మహా సముద్రం గండిని ఆగంబట్టించారు. దాని గురించి నాడు బీసీ వెల్ఫేర్‌ మినిస్టర్‌గా ఉన్న కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నాకు చెప్పారు. ఇదొక్కటి పూర్తి చేస్తే 10-12 ఊళ్లకు మేలైతది, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అప్పుడు చేస్తానని మాటిచ్చా. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రుడు కవ్వా లక్ష్మారెడ్డి, లక్ష్మీకాంతరావు, సతీశ్‌తో కలిసి మహాసముద్రం గండి పనులన్నీ పూర్తి చేశాం. 12 ఊర్లలో నీటి ఊటలు పెరిగినయ్‌’ అని పేర్కొన్నారు.

బామ్మర్ది చెప్పిండనో, మేనమామ చెప్పిండనో, సుట్టం చెప్పిండనో ఓట్లు వేయొద్దు. ఆ పద్ధతి బంద్‌ కావాలి. కచ్చితంగా ఆలోచించి, స్పష్టమైన విధానంతో, స్పష్టమైన అవగాహనతో ఓటింగ్‌ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతాయి.

-సీఎం కేసీఆర్‌

మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో వస్తా

చిగురుమామిడి మండలం ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేదని ఇప్పుడు మిడ్‌ మానేరు నీళ్లతో పచ్చని ప్రాంతంగా మార్చామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని అన్నారు. 'ఎన్నికలు అయిపోయిన ఐదారు నెలల్లో దాన్ని పూర్తి చేసి, దాని నుంచి నీళ్లు విడుదల చేయడానికి నేనే సీఎం హోదాలో మళ్లీ వస్తా' అని చెప్పారు. శనిగరం ప్రాజెక్టు కాలువ పూర్తవుతుందని, కొత్తకొండ వీరభద్రుడి ఆలయాన్ని బాగు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటానని చెప్పారు. సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారిగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.

బిందెతో ఆడబిడ్డ కనిపిస్తే రాజీనామా చేయమన్నా!

ప్రపంచంలో మిషన్‌ భగీరథలాంటి పథకం ఎక్కడా లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నీళ్లు ఎక్కడి నుంచి ఇంటికి వస్తున్నయో ఎవరికీ తెలియదని, ఎక్కడా గొయ్యిలు, మోటర్లు, పంపులు లేవని పేర్కొన్నారు. ఏ ఊర్లో ఏ లెవల్‌ ఎంతున్నదో కొలిచి పైపులైన్లు వేశామని, దీంతో నేరుగా వచ్చి నీళ్లు ట్యాంకులో పడుతున్నాయని తెలిపారు. 'ఎక్కడైనా ఆడబిడ్డ బిందె పట్టుకొని రోడ్డెక్కితే వెంటనే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఆ నాడు చెప్పిన. అంతలా శపథం తీసుకున్నా. నాడు ఎమ్మెల్యేలు, అధికారులు, మంత్రులు అందరు కలిసి పనిచేస్తే.. నేడు మనం మిషన్‌ భగీరథ నీళ్లు తాగుతున్నాం' అని పేర్కొన్నారు.

హుస్నాబాద్‌ గెలుపే నాంది కావాలి

హుస్నాబాద్‌ గెలుపే రేపు 95-105 సీట్ల మధ్య బీఆర్‌ఎస్‌ గెలువడానికి నాంది కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. 'ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరుతున్నాను. దీవించండి. బ్రహ్మాండమైన మ్యానిఫెస్టోను విడుదల చేసినం. కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్మన్‌, సర్పంచులు అందరూ బాధ్యత తీసుకోండి. మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికీ పంచిపెట్టండి' అని సూచించారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌ చాలా మంచి ఎమ్మెల్యే అని, అందరి తలలో నాలుకలా ఉంటాడని చెప్పారు. 'మీ సేవకోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇటువంటివారు చాలా తక్కువగా ఉంటారు. ఆయన సేవలు వినియోగించుకునేందుకు భారీ మెజార్టీతో ఒడితల సతీశ్‌కుమార్‌ను గెలిపించాలి' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 15 2023, 22:26

తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిన అసంతృప్తులు.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన మరో ఇద్దరు కీలక నేతలు....

Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిన అసంతృప్తులు.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన మరో ఇద్దరు కీలక నేతలు....

Singireddy Somasekhar Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటోన్న వేళ ఆ పార్టీకి కీలక నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు..

ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సన్నిహితుడు సోమశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.

సోమశేఖర్ రెడ్డి ఉప్పల్ టికెట్ ను ఆశించారు. అయితే, తనకు రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాదని తేలడంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో పాటు ఆయన భార్య, ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో తెలంగాణలో ఆ పార్టీలో ఇటీవల భారీగా చేరికలు జరిగాయి. తెలంగాణ ఎన్నికలకు త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది.

ఈ సమయంలో ఇటీవలే మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఇంకా ప్రకటించకముందే కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.